లీడ్ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్

  Creating New Dimensions In Agriculture


సంస్థ వివరాలు    

   శ్రీ వినోద్ లాహోటి

Chairman & Managing Director


చైర్మన్ మరియు మ్యానెజింగ్ డైరెక్టర్

వ్యాపారానికి దిశానిర్దేశం చేయడంలో మరియు వ్యూహాత్మక అంతర్దృష్టిని అందించటానికి నాయకత్వ బృందంతో సన్నిహితంగా ఉంటూ, అనుభవం, నైపుణ్యం మరియు విజయానికి సంబంధించిన నిరూపితమైన ట్రాక్ రికార్డ్‌ను కలిగి, వ్యవసాయ రంగములో అత్యధిక మరియు సేంద్రీయ దిగుబడులను అందించాలని నిత్యనూతన సాంకేతికతలను అభివృద్ధి చెందిస్తూ, కొత్త శిఖరాలను అధిరోహిస్తూ విజయానికి చిరునామాగా నిలిచారు లీడ్ క్రాప్ సైన్స్ ప్రై.లి. మ్యానేజింగ్ డైరెక్టర్‌ శ్రీ వినోద్ లాహోటి గారు. ఎగ్జిక్యూటివ్ MBA చదువును పూర్తి చేసుకొని వ్యాపారంలోకి అడుగుపెట్టారు. ఆరోగ్యవంతమైన నేల మరియు మొక్కల పోషకాహార ఆధారిత ఉత్పత్తుల పరిశోధన, తయారీ, మార్కెటింగ్ ద్వారా అవశేషాలు లేని వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి కృషి చేస్తున్నారు. వ్యవసాయాన్ని అవశేష రహితముగా సాధించేందుకు సేంద్రీయ పద్ధతులను ప్రోత్సహించాలని, సేంద్రీయ పద్ధతుల ద్వారా దిగుబడిని పెంచాలన్నది తన యొక్క ధృఢమైన విశ్వాసము. పోషకయుత విషరహిత సాత్విక ఆహారపు దిగుబడి వినియోగాన్ని అభివృద్ధి చేస్తున్నారు.

బ్రహ్మకుమారీస్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ జీవితకాల సభ్యులు శ్రీ వినోద్ లాహోటీ గారు. బ్రహ్మకుమారీస్ సంస్థ సహకారముతో యోగిక వ్యవసాయాన్ని అమలుచేసారు. సానుకూల తరంగాలను మన పొలాలకు అందించటం ద్వారా సాత్విక దిగుబడులను పొందవచ్చును. 

వృత్తిపరమైన విజయాన్ని సాధించినందుకు మరియు తక్కువ వ్యవధిలో సామాజిక సంక్షేమానికి వారి సహకారం కోసం ఇతర జాతీయ మరియు అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు.
1. "భారత్ జ్యోతి అవార్డు"-2017
2. “లీడర్ విత్ స్ట్రాటజిక్ విజన్ అవార్డు” – 2019
3. USA లో జరిగిన IMRC 2014 ఈవెంట్ సందర్భంగా కమ్యూనిటీకి అత్యుత్తమ సహకారం అందించినందుకు అవార్డు
4. అటల్ జనసేవ శిఖర్ సమ్మాన్ అవార్డు - 2021
(న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగిన భారతరత్న స్వర్గీయ శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతి సందర్భంగా ప్రదానం చేశారు)

ప్రజలలో మానవతా దృక్పథాన్ని బలపరచాలనే ఉద్దేశ్యంతో "వాల్యూస్ ఇన్ లైఫ్" పేరుతో
యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించారు శ్రీ లాహోటి గారు. ప్రజలలో అవగాహనను వ్యాప్తి చేయాలని దృఢముగా నమ్ముతారు. ఈ మాధ్యమం ద్వారా చాలా మంది జీవితాలలో మార్పు గమనార్హము. ఒక సంస్థ యొక్క సంస్కృతి ఆ సంస్థ యొక్క సమృద్ధపరమైన ఆస్తి.

జియోలైఫ్ ఫౌండేషన్:-
1. "చెట్లు మనిషికి మంచి స్నేహితులు" అన్న ధృఢ సంకల్పముతో జియోలైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యములో'మొక్కలను నాటే కార్యక్రమము" ప్రారంభించబడినది. ప్రతి సంవత్సరము అధిక మొక్కలను నాటాలన్న నిరంతర ప్రేరణ 2022 సంవత్సరంలో దాదాపు 20000కు పైన చెట్లను నాటడానికి స్ఫూర్తినిచ్చింది.
2. రక్తదానం మహాదానం. ప్రతి సంవత్సరం జనవరి 19న, దేశవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించబడుతాయి. మా సంస్థతో ముడిపడి ఉన్న ప్రతి ఒక్కరూ ఈ మహత్కార్యములో అధిక ఉత్సాహముతో పాల్గొనుచున్నారు.
3. దేశ భవిష్యత్తుకు పునాది యువత. యువతరపు శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని జియోలైఫ్ ఫౌండేషన్ లో భాగముగా జియోలైఫ్ యూత్ క్లబ్ ప్రారంభిచబడినది. దీని ద్వారా చేయుత అవసరమైన విద్యార్థులకు ఎజ్యుకేషన్ కౌన్సెలింగ్ మరియు మిషన్ మిలియన్ పుస్తకాలు వంటి కార్యక్రమాలు దిగ్విజయముగా కొనసాగుతున్నాయి.

"మనకు సాధించాలనే కల ఉన్నప్పుడు, దానిని మరవకండి మరియు కలను సాకారము చేసుకునేంతవరకు ఆగకండి..."

శ్రీమతి బొప్పన జయలక్ష్మి

   Chief Executive Officer

శ్రీ బొప్పన వేణుగోపాల్

   Admin Manager

లీడ్ క్రాప్ సైన్స్ మిషన్

లీడ్ క్రాప్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ నిత్యనూతన సాంకేతిక పరిజ్ణానముతో అను నిత్యం వ్యవసాయ రంగములో నూతన ఉత్పత్తులను అందించటం ద్వారా దేశపు ఆర్థిక పురోగతికి మా వంతు సహకారం అందించటాన్ని మా లక్ష్యంగా నిర్ధారించుకొన్నాము.

లీడ్ క్రాప్ సైన్స్ లక్ష్యం

ఉభయ తెలుగు రాష్ట్రాలలో పోషకయుత, విషరహిత మరియు సాత్వికమైన ఆహార ధాన్యాలను రైతులు దిగుబడి చేయాలన్న సంకల్పముతో ప్రతి దశలో మొక్కలకు అవసరమైన పోషకాలను సరైన సమయములో సరైన మోతాదులో సరైన పద్ధతిలో వివిధ విధానాల ద్వారా పంటలకు పోషణను అందించాలన్నది మా ప్రయత్నము

ఉత్పత్తుల శ్రేణి

సహజసిద్ధమైన వనరుల ద్వారా తయారైన ఈ సేంధ్రీయ ఉత్పత్తులు పర్యావారణానికి అనుకూలముగా ఉన్నాయి. సేంధ్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించే ఈ భావి తరానికి ఇదే విధంగా నిత్య నూతన ఉత్పత్తులను అందిస్తామన్నది మా యొక్క సంకల్పము.



Lead Crop Science Pvt Ltd 

Creating new dimensions in agriculture